Header Banner

అమెరికా టారిఫ్ లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! ఆక్వా రంగం దెబ్బతినే పరిస్థితి..

  Sat Apr 05, 2025 20:48        Politics

అమెరికా అధ్యక్షుడు విధిస్తున్న సుంకాలు అన్ని దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ టారిఫ్ ల గురించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ట్రంప్ టారిఫ్ ల ప్రభావం ఏపీపై కూడా ఉందని, రాష్ట్రంలో ఆక్వా రంగం దెబ్బతినే స్థితికి వచ్చిందని అన్నారు. దీన్ని ఎలా ఎదుర్కోవాలో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించుకుంటామని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూనే, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చంద్రబాబు అన్నారు. పేదల సేవలో భాగంగా ఒకటో తేదీనే పింఛన్లను ఇస్తున్నామని చెప్పారు. స్వయం ఉపాధి కింద అనేక పథకాలను తీసుకొచ్చామని తెలిపారు. నాయకుడు దూరదృష్టితో ఆలోచిస్తేనే జాతి బాగుపడుతుందని చెప్పారు. ఏ వ్యక్తి కూడా పేదరికంలో ఉండటానికి వీల్లేదని అన్నారు. 

 

ఇది కూడా చదవండి: ఇంధన సామర్థ్యంలో రాజా! మారుతి గ్రాండ్ విటారా! అత్యధిక మైలేజ్ తో అద్భుత ఫీచర్లు!

 

మహిళల కోసం డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆర్థికంగా పైకి వచ్చిన వాళ్లు సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలని సూచించారు. ఒకప్పుడు జన్మభూమి కార్యక్రమం చేపడితే అందరూ సహకరించారని... ఇప్పుడు పీ4తో ముందుకు సాగుతున్నామని తెలిపారు. అమరావతి, పోలవరం పూర్తి చేస్తామని... సూపర్ 6 హామీలను అమలు చేస్తామని చెప్పారు. దీపం పథకం కింద ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని తెలిపారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ తల్లికి వందనం పథకం కింద డబ్బులు ఇస్తామని చెప్పారు. మొన్నటి వరకు రోడ్లు ఎలా ఉన్నాయో... ఇప్పుడు ఎలా ఉన్నాయో ప్రజలు గమనించాలని అన్నారు. తాను ఎత్తిపోతల పథకాలను నిర్మిస్తుంటే వైసీపీ వాళ్లు వాటిని పాడు చేయడమే కాక పంపులు, స్టార్టర్లు ఎత్తుకెళుతున్నారని మండిపడ్డారు. వీళ్ల ఆలోచన మారాలని చెప్పారు.

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కీలక దశకు పాస్టర్ ప్రవీణ్ మృతి.. మాజీ ఎంపీపై కేసు న‌మోదు! వైసీపీ గుండెల్లో గుబులు..

 

సెల్ఫీ వీడియోతో కలకలం! ఎస్ఐ వేధింపులతో ఆత్మహత్యాయత్నం!

 

ఆ రూట్ ని మోడరన్ రహదారిగా.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్! నాలుగు లైన్ల రహదారి రూపంలో..!

 

ఏపీలో మెడిసిన్ మేకింగ్ హబ్.. భారీ పెట్టుబడులతో మెగా ప్రాజెక్ట్! 7,500 మందికి ఉపాధి కల్పన!

 

అమెరికాను వీడొద్దు వెళ్తే రాలేరు.. హెచ్‌1బీ వీసాదారులకు - టెక్‌ దిగ్గజాల అలర్ట్‌! ఉద్యోగుల గుండెల్లో గుబులు..

 

అమెరికాను వీడొద్దు వెళ్తే రాలేరు.. హెచ్‌1బీ వీసాదారులకు - టెక్‌ దిగ్గజాల అలర్ట్‌! ఉద్యోగుల గుండెల్లో గుబులు..

ఏపీకి మరో భారీ పెట్టుబడి వచ్చింది.. రూ.5వేల కోట్లతో - ఆ జిల్లాకు మహర్దశ! ప్రత్యక్షంగా, పరోక్షంగా 7,500 మందికి..

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..

 

వైసీపీ ఎంపీ అరెస్ట్.. ప్యాలెస్ షేక్! లిక్కర్ స్కాంలో హైకోర్టు కీలక నిర్ణయం..!

 

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations